![]() |
![]() |

బుల్లితెర మీద కామెడీ టైమింగ్ ని మంచి పండించడంలో రోహిణి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఆమె కామెడీ టైమింగ్ ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది. సేవ్ ది టైగర్స్ మూవీలో రోహిణి కామెడీ మాములుగా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భీమా మూవీలో కూడా రోహిణి మంచి కామెడీ టైమింగ్ తో నటించింది. సుమ అడ్డా షోకి భీమా మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చారు. హీరో గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, రోహిణి, నిర్మాత కేకే.రాధా మోహన్ ఈ షోలో పార్టిసిపేట్ చేశారు.ఇందులో సుమ ఇలా అంది "ప్రొడ్యూసర్ రాధామోహన్ గారి లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం" అనేసరికి రోహిణి మధ్యలో వచ్చి "మీరు నన్ను ఒకటి అడగలేదు..ఎవరైనా క్రష్ ఉన్నారా " అని సుమ అడిగేసరికి "నాకు క్రష్ ఉన్నాడు. స్కూల్లో, కాలేజీలో తెగ వెంటబడేవారు నా గురించి" అని చెప్పింది. అంతేకాదు ఆయనతో కలిసి "కోటలోని మొనగాడా" అనే సాంగ్ కి డాన్స్ స్టెప్స్ కూడా వేసింది.
తర్వాత గోపీచంద్ ని కూడా సుమా కొన్ని ప్రశ్నలు అడిగింది. "ఫ్రెండ్స్ తో మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారు." అనేసరికి "ఫ్రెండ్స్ తో కూర్చుంటే నైట్ లు అలా గడిచిపోతుంటాయి మాట్లాడుకుంటూ ఉంటే" అని చెప్పాడు. "మేము కాలేజీ డేస్ లో, స్కూల్ డేస్ లో డుమ్మా కొట్టేవాళ్ళం సినిమాలకు వెళ్ళేవాళ్ళం, క్లాసులను ఆపేసి క్రికెట్ ఆడుకోడానికి వెళ్ళేవాళ్ళం..లవ్ స్టోరీలు ఉండడానికి మాది గర్ల్స్ స్కూల్ కాదు..బాయ్స్ స్కూల్ " అని చెప్పాడు. ఇక గోపీచంద్ సౌత్ ఆఫ్రికా నుంచి కమెడియన్ రోహిణిని పెళ్లి చేసుకుని వచ్చినట్టు. రోహిణి తలకు క్లాత్ కట్టుకుని వచ్చేసరికి సుమ బాండిట్ క్వీన్ అనడం కాదు అది తమ కల్చర్ లో ఒక భాగం అని హిందీలో చెప్పేసరికి సౌత్ ఆఫ్రికాలో హిందీ మాట్లాడతారా అని సుమ కామెడీ చేయడం బాగుంది. గోంగూర రోటి పచ్చడి చేయడం వచ్చా అని సుమ అడగడం అది తనకు రాదు అని రోహిణి చెప్పిన డైలాగ్ కి అందరూ నవ్వేశారు.
![]() |
![]() |